- ఏసీపీ రవీందర్ రెడ్డి సూచన
నవతెలంగాణ-బెజ్జంకి: జిల్లా పోలీస్ ఉన్నతాధికారి రష్మీ పెరుమాళ్ అమలు చేస్తున్న సురక్ష నేత్రతో గ్రామాల్లో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో సురక్ష నేత్ర కార్యక్రమంపై మండలంలోని అయా గ్రామాల సర్పంచులు,యువతకు ఏర్పాటుచేసిన సమావేశానికి ఏసీపీ రవీందర్ రెడ్డి,సీఐ శ్రీను హజరై సీసీ కెమెరాల వల్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
జిల్లాలో గ్రామాలన్ని సురక్షితమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ ఉన్నతాధికారి చేపట్టిన సురక్ష నేత్ర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీల నాయకులు,వ్యాపారస్తులు,యువత అందరూ బాగస్వాములై సురక్ష నేత్రను విజయవంతమయ్యేల తోడ్పాటును అందించాలని ఏసీపీ రవీందర్ రెడ్డి కోరారు.ప్రతి గ్రామంలో మే 15 వరకు సుమారు 8 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఏసీపీ అధేశించారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు జీవనం సాగిస్తుంటారని..గ్రామాలను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రూరల్ సీఐ శ్రీను సూచించారు.సీసీ కెమెరాలు గ్రామాల భద్రతలో ప్రధాన భూమికను పోషిస్తాయని అందరూ సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని సీఐ శ్రీను తెలిపారు.ఎస్ఐ సౌజన్య,ఏఎస్ఐ ఓదేలు,హెడ్ కానిస్టెబుళ్లు సుధాకర్ రెడ్డి,జబ్బర్ లాల్,సర్పంచులు బొల్లం శ్రీధర్,పులి రమేశ్,బిగుల్ల మోహన్,ఎర్రవెళ్లి శ్రీనివాస్,చిలుముల సతీశ్,అయా గ్రామాల యువత హజరయ్యారు.




