నవతెలంగాణ-గోవిందరావుపేట
సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో నేర నిరయంత్రణ సాధ్యం అని పసర పోలీస్ స్టేషన్ సిఐ జి రవీందర్ అన్నారు. మంగళవారం మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సిసి కెమెరాలను సిఐ రవీందర్ ఎస్ ఐ కమలాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ మీ పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఇవి చాలా ఉపయోగకరమని, మండలంలోని, అన్ని గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో, మరియు గ్రామాల్లోని ప్రతి షాపుల ముందు , సిసి కెమెరాలు పెట్టుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని, తెలిపారు, ఈ సిసి కెమెరాల ఏర్పాటులో , మండలంలోని ప్రజలు, వ్యాపారస్తులు, యువత, సహకరించాలని తెలిపారు. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేర నియంత్రణలో సహకరించాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES