- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై పీఒటీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ యండీ పీవీ గౌతమ్ హెచ్చరించారు. అమ్మిన ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇండ్లను అద్దెకు ఇచ్చినా కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. GHMC పరిధిలో ఇప్పటికే సర్వే పూర్తయ్యిందని, త్వరలో జిల్లాల్లో కూడా పరిశీలిస్తామని చెప్పారు. కొల్లూరు, రాంపల్లిలో కొన్ని ఇళ్లను ₹20–50 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు.
- Advertisement -



