నవతెలంగాణ – మల్హర్ రావు
గత కొద్ది రోజులుగా చెరువుల పరిరక్షణ కోసం కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు ఎన్ని సార్లు అందజేసిన ఇప్పటివరకు ఏమాత్రం చర్యలు లేవని కనీసం ఎంక్వయిరీ చేసిన పాపాన పోలేదని అధికారులు ప్రభుత్వాస్తిని కొల్లగొడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ పూర్తిస్థాయి నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందని డివైఏప్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ అన్నారు. చెరువుల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని మంగళవారం మానవహక్కుల కమిషన్ పిర్యాదు చేసినట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు స్థానిక అధికారులు స్పందించకపోగా మట్టి మాపియతో కుమ్మకయ్యారని ఆరోపించారు.మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదన్నారు.సంబంధించిన అధికారుపై తక్షణమే సమగ్ర విచారణ చేయాలని కోరారు.
కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కాటారం మండల పరిధిలోని వివిధ చెరువులను రాత్రికి రాత్రే చెరువుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా యాక్ట్ 1905ని ఉల్లంఘిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు చెరువులను చేరబడుతున్నారని, ఇప్పటి వరకు రూ.10 కోట్ల రూపాయలకు పైచిలుకు విలువ చేసే మట్టిని తరలించారని దీని ద్వారా చెరువులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని తెలిపారు.కాటారం పరిధిలోని పోతులవాయ్ శివారులోని నల్ల గుంట, విలాసాగారం శంకరంపల్లి ,దేవరంపల్లి, పరికిపల్లి చెరువులలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తక్షణమే మట్టిని దోపిడీ చేస్తున్న అక్రమార్కులపై సమగ్ర విచారణ జరిపి తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం 1905 సెక్షన్ 5, 6,7, వాల్టా చట్టం 2001 సెక్షన్ 3, 4, 6 పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ 15 చెరువుల పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించి మట్టిని దోచుకుంటున్న వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని గత 20రోజుల నుంచి పలుమార్లు కలిసిన వినతులు అందజేసిన అధికారులు పట్టించుకోకపోవడాన్ని వాళ్ళతో కుమ్మక్కయ్యారన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నామని అధికారులకు మీడియలో ఎన్నిసార్లు చెరువుల ఆక్రమణకు సంబంధించిన కథనాలు వచ్చిన బెకాతారు చేశారని అధికారులకు మీడియా అన్న ప్రజాసంఘాలన్నా, ప్రజాసంఘాల వినతులన్నా ప్రజలన్న ప్రభుత్వ ఆస్తులు అన్న ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అన్న విషయం చాలా స్పష్టమైందని ఇప్పటి వరకు కూడా అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని అందుకోసమే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించమని పూర్తి స్థాయి విచారణ జరిపి చెరువులను పరిరక్షించే విధంగా వాటిని ధ్వంసం చేసిన వారిపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తక్షణ చర్యలు ఉంటాయని ఆశిస్తున్నామని తెలిపారు.