నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువలో బుధవారం మొసలి కనిపించడంతో కలకలం రేగింది. ఉదయం వరద కాలువ గట్టుపై నుండి పంట పొలాల్లోకి నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలకు వరద కాలువలో ఓ బండపై సేద తీరుతున్న మొసలి కనిపించింది. వెంటనే వారు విషయాన్ని గ్రామంలో పలువురికి తెలియజేశారు.ప్రస్తుతం వరద కాలువలో కొద్ది మొత్తం మాత్రమే నీరు ఉంది. వరద కాలువలోకి దిగి మత్స్యకారులు, ఇతరులు కూడా చేపలు పడతారు. వరద కాలువలో మొసలి కనిపించడంతో చేపలు పట్టేందుకు వెళ్లే వారు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం వరద కాలువలో కొద్ది మొత్తం మాత్రమే నీరు ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది మొసలిని పట్టేందుకు చర్యలు చేపట్టాలని మత్స్యకారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.
వరద కాలువలో మొసలి కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



