Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో మొసలి కలకలం...

హైదరాబాద్ లో మొసలి కలకలం…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ లో మొసలి కలకలం రేపింది. శుక్రవారం అబ్దుల్లాపూర్ మెట్ లోని తారామతి పేట్ గ్రామంలో మొసలి జనావాసంలోకి రావడంతో జనం భయంతో వణికిపోయారు.తారామతి పేట్ గ్రామం నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా మొసలి గ్రామంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.  జనావాసంలో మొసలి ప్రత్యక్షమవ్వడంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు మొసలిని బంధించి సురక్షితంగా మూసీ నదిలో వదిలేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -