Saturday, September 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపంట నష్టపరిహారం రూ. 51 కోట్లు

పంట నష్టపరిహారం రూ. 51 కోట్లు

- Advertisement -

– రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఉత్తర్వులు
– 5,528 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు సర్కారు అంచనా
– 29 జిల్లాల్లో నష్టపోయిన అన్నదాతలు 41,361 మంది
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పలు దఫాలుగా కురిసిన వడగండ్ల వాన, అకాల వర్షాలకు రాష్ట్రంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ పంట నష్టాన్ని అంచనా వేసింది. ఈమేరకు బుధవారం వ్యవసాయ శాఖ పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రైతుల ఖాతాల్లో రూ. 51.528 కోట్లు జమ చేయాలని నిర్ణయించింది. రైతుల వారీగా వ్యవసాయ శాఖ పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసి ంది. పంట కొనుగోళ్లను చేపడుతున్న సర్కారు…పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని నిర్ణయించినట్టు వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని అంచనా వేశారు. దీనికి సంబంధించి రూ. 51.528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సంబం ధిత విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలోనే పరిహారం జమ చేస్తామని తెలిపిం ది. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4753 ఎకరాలతోపాటు ఇతర పంటలు 477 ఎకరాల్లో నష్టపోయినట్టు అధికారు లు లెక్కలు తీశారు. మే నెలలో జరిగిన పంటనష్టానికి సంబంధించి కూడా ప్ర భుత్వం నివేదిక సిద్ధం చేసింది. అందుకు నిధులు మంజూరు కావాల్సి ఉన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -