Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలు పరిశీలించి నష్టం అంచనా వేయాలి 

పంటలు పరిశీలించి నష్టం అంచనా వేయాలి 

- Advertisement -

– క్షేత్రస్థాయిలో సందర్శించిన డీఎవో స్వరూప రాణి , ఏడిఏ మల్లయ్య 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్ట అంచనాల తయారుచేసి పంపాలని డీఎవో స్వరూప రాణి అన్నారు. సోమవారం  హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్, పందిల్ల గ్రామంలో మొంథా తుఫాన్ తో పంటలు నష్టపోయిన రైతుల వివరాల నమోదు ప్రక్రియ, పంట నష్టపోయిన పొలాలను డీఎవో స్వరూప రాణి, హుస్నాబాద్ ఏ డి ఏ కె.మల్లయ్య ,ఏవో వేల్పుల పూజ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నష్టటపోయిన రైతుల వారీగా వివరాలను సేకరించి మొబైల్ యాప్ అప్లోడ్ చేయాలని సూచించారు. హుస్నాబాద్ డివిజన్ లో నష్టపోయిన పంట వివరాల సర్వే చేయడానికి 30 మంది ఎ. ఇ. ఓ లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సమగ్ర సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు… ఏఈఓ లు పంట పొలాలను పరిశీలించి రైతుల యొక్క వివరాలు సేకరించి సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో ఎ. ఓ పూజ, ఎ. ఇ. ఓ లు విజయ్, భాస్కర్  రైతుల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -