నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావటంతో భక్తులు భారీగా శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. వైకుంఠ క్యూకాంప్లెక్సు కంపార్టుమెంట్లన్నీ నిండిపోవటంతో, క్యూలైన్ ఏటీజీహెచ్ (ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్) వరకూ స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మంగళవారం ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం అర్థరాత్రి వరకు స్వామివారిని 79,003 మంది భక్తులు దర్శించుకోగా.. 33,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES