Wednesday, November 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకార్తీక పౌర్ణమి వేళ తిరుమలలో భక్తుల రద్దీ..

కార్తీక పౌర్ణమి వేళ తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 67,091 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,111 మంది తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -