నవతెలంగాణ-హైదరాబాద్: మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన మేడారం జాతర నేటితో ముగియనుంది. ఇవాళ వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో మహా జాతర ముగుస్తుంది. చివరి రోజుకావడంతో వనదేవతలను దర్శించుకోవడానికి మేడారంకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక, శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేసినా రాలనంత ప్రజలు ఉన్నారు. దీంతో తాడ్వాయి- మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణం అవుతున్నారు.
చివరి రోజు మేడారం జనసంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



