నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్పీ మహమ్మద్ కు బుధవారం శ్రీకాంతచారి మెమోరియల్ అవార్డును ఎమ్మెల్సీ మధుసూదన చారి అందజేశారు. హైదరాబాదులోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో నింగి నేల-మేము సైతం అనే స్వచ్ఛంద సంస్థ సిఆర్పి మామదుకు ఈ అవార్డును అందజేశారని మహమ్మద్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థ తన సేవలను గుర్తించి అవార్డు అందజేయడం సంతోష తగ్గ విషయమని, భవిష్యత్తులో మరింత బాధ్యతయుతంగా పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నింగి నేల-మేము సైతం ఎన్జీవో సభ్యులు అరుణ బంగారు, అనురాధ గౌడ్, ప్రసన్న, రోహిణి, దరువు అంజన్న, సతీష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -