పాకిస్తాన్ మహిళ మినాల్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ మునీర్ అహ్మద్‌ని ఉద్యోగం నుంచి తొలగించించారు. 41వ బెటాలియన్‌కి చెందని మునీర్ పాక్ మహిళను పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచిపెట్టడంతో పాటు ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి చర్యలు… సర్వీస్ రూల్స్‌ని ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు హానికరమని సీఆర్‌పీఎఫ్ తెలిపింది. జమ్మూలోని ఘరోటా ప్రాంతానికి చెందిన అహ్మద్, ఏప్రిల్ 2017లో CRPFలో చేరాడు.
అయితే, సర్వీస్ నుండి తొలగించబడిన కొన్ని గంటల తర్వాత మునీర్ అహ్మద్ మాట్లాడుతూ… గత సంవత్సరం సిఆర్పిఎఫ్ ప్రధాన కార్యాలయం నుండి అనుమతి పొందిన దాదాపు ఒక నెల తర్వాత తాను వివాహం చేసుకున్నానని చెప్పాడు. తన తొలగింపును కోర్టులో సవాలు చేస్తానని, నాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నానని, నా తొలగింపు గురించి నాకు మొదట మీడియా నివేదికల ద్వారా తెలిసింది. ఆ తర్వాత CRPF నుండి తొలగించినట్లు తెలియజేస్తూ ఒక లేఖ వచ్చింది. ఇది నాకు, నా కుటుంబానికి షాక్ ఇచ్చింది’ అని మీడియాకు తెలిపారు.