Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయందారుణం.. ప్రాణం తీసిన చికన్‌ పకోడీ

దారుణం.. ప్రాణం తీసిన చికన్‌ పకోడీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చికెన్ పకోడీ వివాదం ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకున్నది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్‌ పకోడీ లేదన్నాడని హోటల్‌ యజమానిని పీకకోసి చంపేశాడు. పూర్తి వివరాలోకి వెలితే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు రాత్రి పుల్ గా మద్యం సేవించాడు. మత్తులో సమీపంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్లిన అతడు చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే షాపు యజమాని శంకర్‌ లేదని చెప్పాడు. దీంతో తనకు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు. లేదని చెప్పినా వినకుండా షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్‌పైకి దూసుకొచ్చాడు. అతని పీక నొక్కి కింద పడేసే ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటికే మద్యం సేవించి ఉన్న శంకర్ పక్కనే ఉన్న సుత్తిని తీసి మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న కత్తిని తీసి పీక కోశాడు. అనంతరం మిన్నారావు మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -