నవతెలంగాణ – హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భార్యను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42)ను తాడుతో ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రామాచారి ఒక వీడియోను రికార్డు చేశాడు. తన భార్య, కూతురు వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియోను తన ఫోన్‌లో స్టేటస్‌గా ఉంచినట్లు సమాచారం. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, రామాచారికి ఇది రెండో వివాహం. మొదటి భార్య మరణించడంతో సంధ్యను వివాహం చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దారుణం.. భార్యను చంపి, వీడియో పెట్టి భర్త ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



