Saturday, April 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుCrunchyroll Anime Awards-2026: ప్రజెంటర్‌గా ర‌ష్మిక మంద‌న్న‌

Crunchyroll Anime Awards-2026: ప్రజెంటర్‌గా ర‌ష్మిక మంద‌న్న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారత సినీ పరిశ్రమకు అంతర్జాతీయ వేదికపై మరో గర్వకారణంగా నిలిచారు రష్మిక మందన్న. జపాన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే Crunchyroll Anime Awards 2026 కార్యక్రమానికి ఆమెను మరోసారి ప్రజెంటర్‌గా ఆహ్వానించడం విశేషంగా మారింది. ఈ అవార్డ్స్‌ వేడుకలో అవార్డులను అందజేసే తొలి భారతీయ సెలబ్రిటీగా ఇప్పటికే రికార్డు సృష్టించిన రష్మిక, వరుసగా రెండోసారి ఎంపిక కావడం ద్వారా తన స్థాయిని మరింత బలపరిచారు. మే 23న జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న ఈ 10 వ ఎడిషన్‌ వేడుకలో ఆమె పాల్గొననున్నారు. ప్రపంచ యానిమేషన్‌ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేదికపై హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి విజేతలకు అవార్డులు అందించనున్నారు. యానిమే అభిమానిగా గుర్తింపు పొందిన రష్మికకు, పుష్ప (ది రైజ్‌) సినిమాతో జపాన్‌లో విపరీతమైన ఆదరణ లభించింది. ఆమె అభినయం, ఎనర్జీకి అక్కడి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆకర్షితులయ్యారు. ఈ వార్త బయటకు రాగానే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభను మరోసారి చాటేందుకు సిద్ధమవుతున్న రష్మికకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -