నవతెలంగాణ-హైదరాబాద్: భారత సినీ పరిశ్రమకు అంతర్జాతీయ వేదికపై మరో గర్వకారణంగా నిలిచారు రష్మిక మందన్న. జపాన్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే Crunchyroll Anime Awards 2026 కార్యక్రమానికి ఆమెను మరోసారి ప్రజెంటర్గా ఆహ్వానించడం విశేషంగా మారింది. ఈ అవార్డ్స్ వేడుకలో అవార్డులను అందజేసే తొలి భారతీయ సెలబ్రిటీగా ఇప్పటికే రికార్డు సృష్టించిన రష్మిక, వరుసగా రెండోసారి ఎంపిక కావడం ద్వారా తన స్థాయిని మరింత బలపరిచారు. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఈ 10 వ ఎడిషన్ వేడుకలో ఆమె పాల్గొననున్నారు. ప్రపంచ యానిమేషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేదికపై హాలీవుడ్ ప్రముఖులతో కలిసి విజేతలకు అవార్డులు అందించనున్నారు. యానిమే అభిమానిగా గుర్తింపు పొందిన రష్మికకు, పుష్ప (ది రైజ్) సినిమాతో జపాన్లో విపరీతమైన ఆదరణ లభించింది. ఆమె అభినయం, ఎనర్జీకి అక్కడి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆకర్షితులయ్యారు. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రతిభను మరోసారి చాటేందుకు సిద్ధమవుతున్న రష్మికకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Crunchyroll Anime Awards-2026: ప్రజెంటర్గా రష్మిక మందన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



