నవతెలంగాణ-హైదరాబాద్: సియుఇటి – యుజి పరీక్షలను వాయిదా వేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టిఎ) భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 8 నుండి జూన్ 1 వరకు, భారత్ సహా వివిధ దేశాలలో పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. సమన్వయ సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు సమాచారం.అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుందని ఆ వర్గాలు తెలిపాయి. యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. నీట్ తర్వాత, దేశంలోనే ఇది రెండవ అతిపెద్ద ప్రవేశపరీక్ష. భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్ ప్రైవేట్ యూనివర్శిటీల్లో ప్రవేశం కోసం ప్రతి ఏడాది సుమారు 13 లక్షలకు పైగా విద్యార్థులు సియుఇటి పరీక్షల కోసం నమోదు చేసుకుంటారు.
సీయుఇటి-యుజీ పరీక్షలు వాయిదా ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES