Tuesday, May 13, 2025
Homeసినిమావిశ్వక్‌సేన్‌ దర్శకత్వంలో 'కల్ట్‌'

విశ్వక్‌సేన్‌ దర్శకత్వంలో ‘కల్ట్‌’

- Advertisement -

దర్శకుడు, నిర్మాత, రచయితగా విశ్వక్‌సేన్‌ తన ప్రతిభను చాటారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ‘కల్ట్‌’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను తారక్‌ సినిమాస్‌, వన్మయే క్రియేషన్స్‌ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్‌ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశ్వక్‌సేన్‌ దర్శకుడిగానే కాదు, కథ కూడా స్వయంగా రాసుకున్నారు. న్యూ ఏజ్‌ పార్టీ థ్రిల్లర్‌గా, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి కోర్‌ టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎస్‌.రాధాకష్ణ (చిన్నబాబు) టైటిల్‌ లోగోను లాంచ్‌ చేశారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు, అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్‌ చిత్రీకరణ కూడా నేడు ప్రారంభమైంది. ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌తోపాటు 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు, హిందీ, జపనీస్‌, స్పానిష్‌, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో విశ్వక్‌సేన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్‌సేన్‌, నిర్మాతలు: కరాటే రాజు, సందీప్‌ కాకర్ల, సంగీతం: రవి బస్రూర్‌, డీఓపీ: అర్వింద్‌ విష్వనాథన్‌, ఎడిటర్‌: రవి తేజ గిరిజాల, ఆర్ట్‌ డైరెక్టర్‌: అర్వింద్‌ ములే, కొరియోగ్రాఫర్‌: వశ్వంత్‌ మాస్టర్‌, యాక్షన్‌ డైరెక్టర్‌: కరుణక్‌ ఏఆర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అన్నపూర్ణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -