– తొగుట సిఐ షేక్ లతీఫ్
నవతెలంగాణ-రాయపోల్ : తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం తెలుసుకోవాలని,సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రీడా-సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో గ్రామ ఐక్యత, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలనే లక్ష్యంతో గ్రామానికి చెందిన గంగి యాదగిరి ఆధ్వర్యంలో యువకులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించగా, మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలలో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీలు ఉత్సాహభరితంగా సాగి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గెలుపొందిన వారికి బహుమతులు గంగి యాదగిరి అందజేయడం గ్రామస్థుల ప్రశంసలు పొందాడు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఈ పోటీలు ఐక్యతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు.యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో మంచి క్రీడాకారులు వెలువడతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తిమ్మక్ పల్లి గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరం తెలుసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



