Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే చొరవతో తీరిన కరెంట్ కష్టాలు 

ఎమ్మెల్యే చొరవతో తీరిన కరెంట్ కష్టాలు 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు సెంటర్లో కరెంటు సౌకర్యం లేక రాత్రి వేళలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 4 వ,5 వ వార్డు మాజీ కౌన్సిలర్లు ఇల్లందుల శ్రీనివాస్, అధికం సుగుణ బాలకిషన్ గౌడ్ లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి విన్నవించగా..  ఆయన చొరవతో విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసి కరెంటు సరఫరాను చేస్తున్నారని తాజా మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ తెలిపారు. రైతులు పడుతున్న ఇబ్బందుల్ని తొలగించిన సందర్భంగా వారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -