- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులైన పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ సోమవారం ముగిసింది. సిట్ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్, రోహిత్ రెడ్డి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. గత ఐదు నెలల్లో రోహిత్ రెడ్డి పది సార్లు దుబాయ్ వెళ్లినట్లు గుర్తించారు. దుబాయ్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా సిట్ అధికారులు వివరాలు సేకరించారు.
- Advertisement -



