Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంపృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ తనిఖీలు

పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ‘ఆపరేషన్ నుముఖోర్‌’లో భాగంగా మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. భూటాన్ నుంచి లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో కొచ్చితో మొత్తం 30 చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో అధికారుల సోదాలు ముమ్మురంగా చేస్తున్నారు. భూటాన్ నుంచి దాదాపు 100 అత్యంత లగ్జరీ కార్లను కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి దేశంలోకి తీసుకొచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది. దీంతో తాజాగా కస్టమ్స్ అధికారులు చేపడుతోన్న తనిఖీలుకు ప్రధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -