Sunday, November 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌.. 81 మంది అరెస్టు

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌.. 81 మంది అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్‌ చేపట్టింది. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ.95 కోట్ల విలువైన మోసాలు చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలున్నారు. 58 మంది మ్యూల్ ఖాతాదారులున్నట్లు గుర్తించారు. వారి నుంచి 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -