Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపెరుగుతున్న ప్రమాదాల్లో సైబర్‌ నేరాలు ఒకటి : డీజీపీ జితేందర్‌

పెరుగుతున్న ప్రమాదాల్లో సైబర్‌ నేరాలు ఒకటి : డీజీపీ జితేందర్‌

- Advertisement -

– ‘వ్యూహ ల్యాబ్స్‌-ఇన్నోవేషన్‌ హబ్‌’ ప్రారంభం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

సైబర్‌ నేరాలను ఎదుర్కోవడానికి సృజనాత్మకత, సహకారం, ముందుచూపు అవసరమని తెలంగాణ డీజీపీ జితేందర్‌ అన్నారు. సైబర్‌ నేరాలు వేగంగా పెరుగుతున్న ప్రమాదాలలో ఒకటి అని ఆయన తెలిపారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ), ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీ-హెచ్‌) సంయుక్తంగా ‘వ్యూహా ల్యాబ్స్‌-ఇన్నోవేషన్‌ హబ్‌’ను ఆవిష్కరించాయి. ఐఐఐటీ హైదరాబాద్‌ ప్రాంగణంలో అధికారికంగా దీనిని రపారంభించారు. ఈ హబ్‌ను తెలంగాణ డీజీపీ జితేందర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సైబర్‌ నేరాల గురించి మాట్లాడారు. వ్యూహా ల్యాబ్స్‌ రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఒక మోడల్‌గా నిలుస్తాయని అన్నారు. సైబర్‌ నేరాల నిరోధకతకు ఇన్నోవేషన్‌ ఆధారిత పరిష్కారాలు అవసరమనీ, తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ వాటిని అమలుపర్చటంలో ముందంజలో ఉన్నదని టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ అన్నారు. ఈ హబ్‌ సుస్థిరమైన, విస్తరించదగిన డిజిటల్‌ భద్రతా పరికరాలను అభివృద్ధి చేసే ఎకోసిస్టమ్‌ను అందిస్తుందని చెప్పారు. ఐఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సందీప్‌ శుక్లా మాట్లాడుతూ.. సైబర్‌ సెక్యూరిటీ అనేది కేవలం సాంకేతిక సమస్య కాకుండా సామాజిక సమస్య అని కూడా తెలిపారు. వ్యూహ ల్యాబ్స్‌ పౌరులు, సంస్థలను రక్షించడంలో ప్రభావవంతమైన పరిష్కారాలను వేగవంతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఐల్యాబ్స్‌ క్యాపిటల్‌ చైర్మెన్‌, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు శ్రీని రాజు, టీజీసీఎస్‌బీ ఎస్పీ హర్షవర్ధన్‌తో పాటు ఐఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad