- Advertisement -
నవతెలంగాణ నల్లగొండ:
నల్లగొండలో సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. మున్సిపల్ అధికారులమని చెప్పుకుంటూ, ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, స్కానర్ పంపి డబ్బులు చెల్లించమని ఫోన్లు చేస్తున్నారు. తాజాగా ఒక ఆస్పత్రికి ఫోన్ చేసి, స్కానర్ ద్వారా ప్రాపర్టీ టాక్స్ కట్టాలని చెప్పిన కేటుగాళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చి ఆస్పత్రి యాజమాన్యం మున్సిపల్ అధికారులను సంప్రదించడంతో ఈ విషయం బయటపడింది. ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -



