- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దిత్వా తుపాన్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా సముద్ర తీర ప్రాంతాలతో పాటు ముంపు ప్రాంతాలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్థానిక వాతావారణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుక్కుడి, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాసి, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం జిల్లాలు మరియు కారైకల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



