- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో, తీరప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈరోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
- Advertisement -



