Sunday, February 1, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్.. ఇద్దరు కార్మికులు మృతి

గ్యాస్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్.. ఇద్దరు కార్మికులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం రాత్రి సూపర్ గ్యాస్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -