నవతెలంగాణ-గోవిందరావుపేట
అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండలం లోని చల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గణపాక సుధాకర్ కి దళిత రత్న అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మరియు మండల నాయకులు మాట్లాడుతూ సుధాకర్ కి దళిత రత్న అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని మనసారా కోరుకుంటున్నాము అదేవిధంగా పార్టీలో కూడా వివిధ రకాల కీలక పెద్ద పదవులు పొందాలని మనసారా కోరుకుంటున్నాము అని అన్నారు ఈ సందర్భంగా గణపాక సుధాకర్ మాట్లాడుతూ నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి మనసారా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను నా యొక్క దళిత వర్గానికి చెందిన వారికి తోడుగా ఉంటూ అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతానని మనసారా తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి సుధాకార్ జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి జంపాల చంద్రశేఖర్ జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులుపెండెం శ్రీకాంత్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న మండల మహిళా అధ్యక్షురాలు మద్దాల నాగమణి మాజీ ఎంపిటిసి గోపి దాసు ఏడుకొండలు సూది రెడ్డి జనార్దన్ రెడ్డి కట్ల జనార్దన్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు ఆర్ వి తండ కృష్ణ మాజీ సర్పంచ్ జోగా, రాజు నాయక్ సారయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు
దళిత రత్న అవార్డు గ్రహీత గణపాక సుధాకర్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES