Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeమెదక్చెట్టుకు కట్టేసి దళిత మహిళపై దాడి

చెట్టుకు కట్టేసి దళిత మహిళపై దాడి

- Advertisement -

– బూతులు తిట్టిందనే నెపం
– సిద్దిపేట జిల్లా చేబర్తిలో ఘటన
నవతెలంగాణ-మర్కుక్‌
: బూతులు తిట్టిందనే నెపంతో ఓ దళిత మహిళను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ అమానుష ఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల పరిధిలోని చేబర్తి గ్రామంతో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చేబర్తి గ్రామానికి చెందిన దళిత మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆవేదన వెలిబుచ్చింది. ఈ క్రమంలో తమనే తిడుతుందన్న అనుమానంతో ఆ మహిళపై చుట్టుపక్కల కొందరు దాడి చేశారు. ఆమెను ఈడ్చుకొచ్చి సావిత్రీబాయి, జ్యోతిరావుపూలే విగ్రహాల వద్ద ఉన్న చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు. వారిని వారించి బాధితురాలిని విడిపించారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img