. పట్టించుకోని కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్
నవతెలంగాణ టేకుమట్ల
మండలంలోని సోమనపల్లి గ్రామ దళితవాడకు పది రోజులుగా మంచినీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు బోరు నీళ్లు త్రాగడం మూలంగా ప్రజలకు జలుబు, దగ్గు, విషజ్వరాల బారిన పడుతున్నారని తక్షణమే సమస్యను తీర్చాలని సిపిఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులు పంచాయతీ కార్యదర్శికి, స్పెషల్ ఆఫీసర్ కు పలుమార్లు చెప్పిన దళిత కాలనీలో ఎలాంటి సమస్య ఉన్న అధికారులు కాలయాపన చేస్తూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని లేనియెడల ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మారపల్లి కొండయ్య, జీడి సమ్మయ్య, అంబాల సమ్మయ్య, జీడి సృజన ,రామ్ యాకూబ్, జీడి రాజు అంబాల రమ పాల్గొన్నారు.



