Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో కూలిన డ్యామ్‌

ఛత్తీస్‌గఢ్‌లో కూలిన డ్యామ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌ జిల్లాలో డ్యామ్‌ కూలిపోవడంతో వరదలు ముంచెత్తాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ ప్రాంతంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ జిల్లాలోని ధనేష్‌పూర్‌ గ్రామంలో నాలుగు దశాబ్దాల నాటి లూటి రిజర్వాయర్‌ కొట్టుకుపోయినట్లు ఫిర్యాదు అందిందని సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అభిషేక్‌ గుప్తా తెలిపారు. డ్యామ్‌ కొట్టుకుపోవడంతో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించిందని, పలువురు కొట్టుకుపోయారని అన్నారు. మంగళవారం రాత్రి రెండు మృతదేహాలను, త బుధవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించామని అన్నారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -