Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంహిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో దెబ్బ‌తిన్న ర‌వాణా వ్య‌వ‌స్థ‌

హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో దెబ్బ‌తిన్న ర‌వాణా వ్య‌వ‌స్థ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వ‌ర్ష‌కాలంలో భారీ వానాల‌తో పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లమైన హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్..మ‌రోసారి మంచు తుపాన్‌తో కుదేలైపోయింది. ప‌లు రోజుల నుంచి కురుస్తున్న‌ భారీ మంచు తుపాన్‌తో ఆ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ ప‌లు రోడ్లపై మంచుప‌డి ధ్వంస‌మైయ్యాయి. దీంతో వివిధ ప్రాంతాల‌కు రాక‌పోక‌లు దెబ్బ‌తిన్నాయి. సాధార‌ణ జ‌న‌జీవ‌నం స్తంభిపోయింది. ఉష్టోగ్ర‌త‌లు క‌నిష్ట స్థాయికి పడిపోవ‌డంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదురుకున్నారు. ప‌లు ప్రాంతాల్లో తాగునీటి పైపులు మంచు ధాటికి ధ్వంసమైయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారుల‌తో క‌లుపుకొని 482 రోడ్లు మూత‌బ‌డ్డాయ‌ని స్టేట్ ఎమ‌ర్జెన్సీ ఆప‌రేష‌న్ సెంట‌ర్ (SEOC) పేర్కొంది. 62 వాట‌ర్ స‌ప్ల‌య్ కేంద్రాలపై మంచు తుపాన్ తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని వెల్ల‌డించింది. చంబా అనే జిల్లా మంచు తుపాన్ తో అధికంగా దెబ్బ‌తింద‌ని ప్ర‌క‌టించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచు తుపాన్‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో మ‌ర‌మ్మ‌తు కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రంగా చేప‌ట్టామ‌ని SEOC పేర్కొంది. ప్రాధాన్య‌త క్ర‌మంగా ఆయా రంగాల్లో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను కొసాగిస్తున్నామ‌ని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -