- Advertisement -
నవతెలంగాణ బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం సోలిపేట గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు మెట్లు శిథిలా వస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయి. ప్రస్తుతం వేసవిలో గ్రామ ప్రజలకు స్వచ్ఛజలం అందించేందుకు నెలకు కనీసం మూడు సార్లు ట్యాంకును శుభ్రం చేయాల్సి ఉంటుంది. పైకి ఎక్కేందుకు నిర్మించిన మెట్లన్నీ శిథిలమయ్యాయి. నిత్యం పెచ్చులు ఊడిపడుతున్నాయి. ప్రమాదం జరగక ముందే మిషన్ భగీరథ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



