- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని భారత సంతతికి చెందిన అమెరికా టీవీ యాంకర్, పాకశాస్త్ర నిపుణురాలు పద్మాలక్ష్మి అన్నారు. ప్రస్తుత చీకటి కాలం ఆందోళనకరమని ఆమె అభిప్రాయపడ్డారు. ‘పద్మాస్ ఆల్ అమెరికన్: టేల్స్, ట్రావెల్స్ అండ్ రెసిపీస్ ఫ్రమ్ టేస్ట్ ది నేషన్ అండ్ బియాండ్’ పేరుతో తాను రాసిన వంటల పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె మాట్లాడారు.
అమెరికాలో మళ్లీ వెలుగులు వస్తాయని ఆశిస్తున్నానని, కానీ అంతకంటే ముందే మరింత చీకటి అలముకుంటుందని ఆమె జోస్యం చెప్పారు. అమెరికాలో విభిన్న వర్గాలకు చెందిన వారు, ఇతర దేశాల నుంచి వలస వచ్చినవారు ఒకరికొకరు దగ్గర కావడానికి తన రచన తోడ్పడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -



