Sunday, January 18, 2026
E-PAPER
Homeఆటలు‘శ‌త‌’క్కొట్టిన మిచెల్, ఫిలిప్స్

‘శ‌త‌’క్కొట్టిన మిచెల్, ఫిలిప్స్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండోర్ వేదిక‌గా మూడో వన్డేలో కివీస్ జ‌ట్టు కెప్ట‌న్ డ‌రిల్ మిచెల్, ఫిలిప్స్ సెంచ‌రీ చేశారు. డ‌రిల్ మిచెల్ 106 బంతుల్లో 100 ప‌రుగులు చేశారు. 10 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో అద‌రగొట్టాడు. అదే విధంగా స‌హ‌చ‌ర బ్యాట‌ర్ ఫిలిప్స్(100) కూడా 8 ఫోర్లు, 3 సిక్స్‌తో సెంచ‌రీ సాధించాడు. ఇరువురు క‌లిసి స‌ముచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇద్ద‌రు క‌లిసి మూడు వికెట్‌కు 149 బంతుల్లో 154 ప‌రుగుల సాధించారు. గ‌త మ్యాచ్‌లో కూడా అద్భుత‌మైన సెంచ‌రీతో డ‌రిల్ మిచెల్ జ‌ట్టుకు విలువైన విజ‌యాన్ని అందించాడు. మొద‌టి వ‌న్డేలో అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు వ‌న్డేల సిరీస్‌లో డ‌రిల్ మిచెల్ కెప్ట‌న్ ఇన్సింగ్స్‌తో అద‌ర‌గొడుతున్నాడు.

టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.అయితే ఆట ఆరంభంలోనే కీవీస్ భారీ దెబ్బ త‌గిలింది. ఆర్ష‌దిప్ సింగ్ వేసిన‌ మొద‌టి ఓవ‌ర్ నాలుగో బంతికే హెచ్ నికోల‌స్, హ‌ర్షిత రాణా వేసిన‌ సెకంట్ ఓవ‌ర్‌లో డీపీ కాన్వే పెవిలియ‌న్ చేరాడు. యంగ్ 30ప‌రుగులు చేసి క్యాచ్ అవుటైయ్యాడు. ప్ర‌స్తుతం 42 ఓవ‌ర్లు ముగిసేరికి కీవీస్ స్కోర్‌: 266-3.

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇండోర్‌ లో హోల్కర్‌ స్టేడియంలో మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -