- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో తల్లిని హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టిన దారుణ ఘటన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చింది. కూతురు ఇషికా, ఆమె ప్రియుడు మౌంటీ రాజ్‌పుత్ కలిసి తల్లిని హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తల్లి కనిపించడం లేదని, బైక్ కూడా మిస్ అయిందని ఏడాది క్రితం కూతురు ఫిర్యాదు చేసింది. అయితే, మార్చి 24న బైక్‌ను విక్రయించేందుకు ప్రియుడు ప్రయత్నించగా పోలీసులకు సమాచారం అందింది. విచారణలో ఈ దారుణం బయటపడటంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -



