- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంగలు పొంగిపొర్లుతున్నాయి. ఈక్రమంలోనే ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో అంజనాజపురం నిమ్మవాగు వంతెనపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పల్లిపాడు-ఏన్కూర్ మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న డీసీఎం వాహనం వంతెనను దాటడానికి ప్రయత్నించగా.. డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ గల్లంతయ్యాడు.
- Advertisement -



