Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమహారాష్ట్రలో బైక్‌పై మృత‌దేహాం త‌ర‌లింపు

మహారాష్ట్రలో బైక్‌పై మృత‌దేహాం త‌ర‌లింపు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో.. భర్త నిస్సహాయంగా ఉండిపోయాడు. తీవ్ర నిరాశకు గురైన భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన డియోలాపర్ పోలీసు అధికార పరిధిలోని మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సియోనికి చెందిన అమిత్ యాదవ్, గ్యార్సి అమిత్ యాదవ్ దంపతులు గత 10 సంవత్సరాలుగా నాగ్‌పూర్ సమీపంలోని లోనారాలో నివసిస్తున్నారు. రక్షాబంధన్ రోజున అమిత్ తన భార్యతో కలిసి లోనారా నుండి కరణ్‌పూర్‌కు బయల్దేరాడు. బైక్‌పై వెళ్తున్న ఈ జంటను మోర్ఫాటా ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల గ్యార్సి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం తర్వాత అమిత్ వాహనదారుల సహాయం కోరాడు. కానీ ఎవరూ అతడికి సాయం చేయలేదు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో అమిత్ నిరాశకు గురయ్యాడు. చివరికి భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి కొన్ని కిలోమీటర్ల పాటు తీసుకెళ్లాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img