నవతెలంగాణ-కామారెడ్డి: జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ – పాస్ మెట్రిక్ స్కాలర్షిప్ (2025 – 26) కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తమ వివరాలను అధికారిక వెబ్సైట్ http://telanganaepass.cgg.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల సమర్పణకు గడువు 20.04.2026 వరకు మాత్రమే ఉండటంతో, విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలోని సంబంధిత కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించి, ఎక్కువ మంది ఈ పథకం ప్రయోజనాలు పొందేలా సహకరించాలని ఆయన ప్రకటనలు విజ్ఞప్తి చేశారు.
ఈ-పాస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు గడువు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



