Tuesday, September 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 71మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 71మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో శరణార్థులను తీసుకెళ్తున్న బస్సు, మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 71మంది మరణించారు. బస్సు మొదట మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి, ఆపై ఇంధనం తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకొని 71మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. అల్ జజీరా వార్తా నివేదిక ప్రకారం బస్సు అతి వేగం, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాబూల్‌కు వెళ్లే బస్సు మార్గంలో ఇటీవల ఇరాన్ నుండి బహిష్కరించబడిన శరణార్థులు ఉన్నారని ప్రావిన్షియల్ అధికారి మొహమ్మద్ యూసుఫ్ సయీది తెలిపారు. మృతుల్లో ట్రక్కులో ఉన్న ఇద్దరు, మోటార్ సైకిల్ పై ఉన్న మరో ఇద్దరు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -