Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుగుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: నగరంలోని ఒక‌టో పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి బుధవారం తెలిపారు. ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ తిలక్ గార్డెన్ రూప్ ఛాయా ఫోటో షాప్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి కింద పడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీస్ వారికి సమాచారం ఇచ్చారు. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న‌ పోలీస్ సిబ్బంది 108 ద్వారా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించినారు. ఇవాళ‌ ఉదయం 9 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అతని వయసు సుమారు 50 నుండి 55 వరకు ఉంటుంది. మృతుడు గ్రీన్ కలర్ రంగు ఫుల్ షర్ట్, తెలుపు రంగు లుంగీ వేసుకున్నాడు. బాధితునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌న్నారు. గుర్తుతెలియని వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ల‌భించిన‌ట్ల‌యితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714 కు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -