నవతెలంగాణ-కంఠేశ్వర్: ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని ఓ మహిళ మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి మంగళవారం తెలిపారు. జూన్ 6వ తేదీ మధ్యాహ్న సమయం 12:30 గంటలకు రైల్వే స్టేషన్ రేకుల షెడ్ దగ్గర గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉందని తమ కు సమాచారమందిందని పోలీసులు తెలిపారు. ఆ బాధితురాలని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించమన్నారు. పరిశీలించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతురాలి వయసు 60నుండి 65 సంవత్సరాలు ఉంయని, ముస్లిం వర్గానికి చెందని మహిళగా గుర్తించామన్నారు. మృతురాలు ఎరుపురంగు చుక్కలు గల చుడిదార్, ఆరెంజ్ రంగు కలర్ చీర ధరించి ఉందని, సదరు మహిళ గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712659714 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి తిరిగా ప్రాణం పోసే ఆరుదైన అవకాశం అందరికి రాదు. అది మా డాక్టర్లకు మాత్రమే ఉన్న అదృష్టం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఎంతో ఆనందం ఉంది. వైద్య వృత్తి ఎంతో సంతృప్తిని ఇస్తోంది. జూలై 1 డాక్టర్స్ డే ను పురస్కరించుకొని వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.