నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గురుతు తెలియని మహిళా మృతి చెందిందని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శనివారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10వ తేదీ ఉదయం 9 గంటలకు నిజామాబాద్ గంజు మార్కెట్ లో గోల్డ్ షాప్ ఎదురుగా ఒక గుర్తు తెలియని మహిళా పడి ఉండగా షాప్ వాళ్ళు చూసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా అక్కడికి పోలీస్ వారు చేరుకుని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ కు తరలించారు.అక్కడే ఉన్న డాక్టర్స్ వచ్చి చెక్ చేయగ ఈమె చనిపోయినట్లుగా నిర్ధారించారు.
ఆమె వయసు సుమారు గా 45 నుండి 50 ఉంటుంది. అమే పైన బట్టలు మెరూన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ సారి మరియు ఎరుపు రంగు స్వెటర్ కలదు. ఈమె వాలకం బట్టి భిక్షాటన చేసుకునే మహిళా గా కనపడుతున్నది, ఈమే దగ్గర చెక్ చేయగా ఎటువంటి ఆధారాలు దొరకలే దు. ఆమె ఎడమ చేయి పైన గంగమ్మ అని పచ్చ బొట్టు రాసి ఉంది.గుర్తుతెలియని మహిళా మృతదేహం గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714 కు సంప్రదించాలన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



