నవతెలంగాణ హైద్రాబాద్ : అమెరికా- ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాడిని ఇరాన్‌పై ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందారని.. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. నేను ప్రజల స్వేచ్ఛను కోరుకుంటున్నా.. నాకు సురక్షితమైన దేశం కావాలి.. అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు.. అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది.. ఖమేనీ సురక్షితంగా ఉన్నారంటూ పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



