Wednesday, April 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష

పాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష

- Advertisement -

ఇజ్రాయిల్‌ పార్లమెంటు ఆమోదం
ఉగ్రవాదుల వంకతో సామూహిక మరణశిక్షలకు చట్టం
జెరూసలేం
: పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయిల్‌ చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది. తన దాడులతో ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న నెతన్యాహు ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా పాలస్తీనా ఖైదీల పట్ల మరింత దారుణ వైఖరి ప్రదర్శించింది. పాలస్తీనా ఖైదీలను ఉగ్రవాదుల వంకతో సామూహికంగా మరణశిక్ష విధించేలా ఇజ్రాయిల్‌ తాజాగా చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం గత కొన్నేళ్లుగా పార్లమెంటులో ఆమోదం పొందలేదు. కానీ ఈసారి వివాదాస్పదమైన శిక్షాస్మృతి (సవరణ- ఉగ్రవాదులకు మరణశిక్ష) బిల్లును మార్చి 25న పార్లమెంటులో ప్రవేశపెడితే.. పార్లమెంటరీ కమిటీ దీన్ని ఆమోదించింది. ఈ బిల్లు సోమవారం చట్టంగా మారింది. ఈ బిల్లుకు పార్లమెంటులో 62 అనుకూల ఓట్లు పడగా.. దీన్ని 48 మంది పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించారు. ఈ చట్టాన్ని అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. ఇది ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో వర్ణ వివక్షలాంటి న్యాయ వ్యవస్థను పటిష్టం చేసే ప్రమాదం ఉందని, ఇప్పటికే ఉన్న ఘర్షణల్ని మరింత తీవ్రతరం చేస్తుందని విమర్శకులు హెచ్చరించారు.
కాగా, ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఇజ్రాయిల్‌ మంత్రి బెన్‌ గ్విర్‌ మాట్లాడుతూ.. ‘ఈరోజు నుంచి ప్రతి ఉగ్రవాదికి, యావత్‌ ప్రపంచానికి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే.. ఎవరైతే ప్రాణం తీస్తారో, ఇజ్రాయిల్‌ రాజ్యం వారి ప్రాణాన్ని తీస్తుంది’ అని ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే పాలస్తీనా ప్రజలపై ఈ చట్టం ద్వారా సామూహికంగా శిక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -