నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌లో వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 బిజిఐ శిక్షణ విమానం ఒక్కసారిగా కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో నిన్న రాత్రి 9 గంటల వరకు పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ తౌకీర్ ఇస్లాం సహా 16 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. కాగా ఈ సంఖ్య మంగళవారం ఉదయం 11 గంటలకు 27 కు చేరింది. వైమానిక విమానం.. స్కూల్ బిల్డింగ్ పై పడిపోవడంతో 171 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 88 మంది విద్యార్థులు ఉన్నారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఢాకా విమాన ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES