- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రంలో నిన్న జరిగిన బ్రిడ్జి కుప్పకూలిన సంఘటనలో.. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సంఘటనలో 15 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన చేశారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇక ఈ సంఘటనలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ సంఘటనలో 14 మందిని రక్షించామని.. మరో ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -