Sunday, July 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటెక్సాస్‌లో పెరిగిన మృతుల సంఖ్య‌..గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం

టెక్సాస్‌లో పెరిగిన మృతుల సంఖ్య‌..గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం

- Advertisement -


నవతెలంగాణ-హైద‌రాబాద్: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా వ‌ర‌ద‌ల్లో చిక్కుకొని 50 మంది ప్రాణాలు కోల్పోయార‌ని సీఎన్ఎన్ మీడియా పేర్కొంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా పౌరులను సహాయక బృందాలు రక్షించాయి. విపత్తు నేపథ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ బాధితుల‌ను ర‌క్షించ‌డానికి స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని, యుద్ధ‌ప్ర‌తిపాద‌క‌న రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టామ‌ని తెలిపారు.

మరోవైపు కెర్‌ కౌంటీలోని గ్వాడలూప్‌ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్‌ క్యాంప్‌ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తింది. దీంతో శిబిరంలోని 23 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల సమాచారాన్ని తెలపాలని వారి కుటుంబాలు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -